Hello Readers who are searching SC Corporation Loans in Telangana 2021 Last Date your Search ends here. Keeping in mind the special borrowing needs of the SC entrepreneurs, the Government of Telangana has launched the Stand-Up Scheme as part of its financial inclusion initiative. Further, with a view to provide equal opportunity to all, the loans have been framed in a way to benefit this category with relaxed criteria in case of setting up a new venture.
SC Corporation Loans in Telangana 2021 Last Date
ఎస్సీ కులాలకు చెందిన నిరుద్యోగ యువత స్వశక్తిమీద ఆధారపడేందుకు, ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు వీలుగా ఎస్సీ కార్పొరేషన్ వార్షిక ప్రణాళిక ఖరారు చేసింది. 2020- 21 ఆర్థిక సంవత్సరానికి 993 మందికి రూ. 40.77 కోట్లను ప్రోత్సాహాకంగా ఇవ్వనున్నది. దీంట్లో రూ. 25. 42 కోట్లు సబ్సిడీగా, మరో రూ. 15.35 కోట్లు రుణం ఇవ్వనున్నారు.
ముఖ్యంగా టాన్స్‌పోర్ట్ సెక్టార్‌కు ఈ ఏడాది అధిక ప్రాధాన్యతనిచ్చారు. సబ్సిడీపై ఎలక్ట్రిక్ ఆటోలు, ఈ – వెహికిల్స్‌ను ఈ ఏడాది ఎక్కువగా ఇవ్వబోతున్నారు. జిల్లాలో ఆసక్తి, అర్హత గల వారు జనవరి 5వ తేదీలోగా www.tsobmms.cgg.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మాన్యనాయక్ తెలిపారు.
- ఎస్సీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్యశిక్షణకు రూ. 1.24 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో 155 మందికి శిక్షణనివ్వనున్నారు.
- జిల్లా ప్రోత్సాహాకాల కింద రూ. 2.80 కోట్లను బ్యాంక్ లింకేజీ లేకుండా పూర్తి ఉచితంగా అందజేయనున్నారు. ఇలా 14 మంది వికలాంగ, వితంతువులు, ఏయిడ్స్ రోగులు రూ. 50 వేలను అందజేయనున్నారు.
- స్పెషల్ ఎంపవర్‌మెంట్ ప్రోగాం ఒక్కోక్కరికి రూ. 5లక్షల వరకు సబ్సిడీతో కూడిన రుణాన్ని అందజేయనున్నారు. ఇలా 125 మందికి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా..రూ. 3.75 కోట్ల సబ్సిడీ, రూ. 2.50 కోట్ల బ్యాంక్ రుణం కలిపి, మొత్తంగా 6.25 కోట్లను అందజేస్తారు.
ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తు చేసేవారు చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నారు. కేవలం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి తమ పని అయిపోయిందని అనుకుంటున్నారు. ఇది పూర్తిగా పొరపాటు. ఆన్‌లైన్ చేసిన ఆయా దరఖాస్తును ప్రింట్‌తీసి, తగు డాక్యుమెంట్లను జతపరిచి నాంపల్లి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో సమర్పించాలి. ప్రింట్ తీసిన దరఖాస్తులను సమర్పిస్తేనే లబ్ధిదారులుగా ఎంపికచేస్తాం.- బి. మాన్యనాయక్, ఈడీ ఎస్సీ కార్పొరేషన్
SC Corporation loans in Telangana 2021 Eligibility
- ఎస్సీ కులాలకుచెందినవారు అర్హులు
- హైదరాబాద్ జిల్లా వాసులై ఉండాలి.
- వయస్సు 21 -50సంవత్సరాల లోపు ఉండాలి
- వార్షిక ఆదాయం రూ. 2 లక్షల లోపు ఉండాలి
- గత ఐదేండ్లలో దరఖాస్తుదారుడు, వారి కుటుంబం
- ఎస్సీ కార్పొరేషన్ నుంచి లబ్ధి పొంది ఉండకూడదు.
రాయితీలు ఇలా..
- రూ. లక్ష యూనిట్‌కు 80శాతం
- రూ. 2 లక్షల యూనిట్‌కు 70శాతం
- రూ. 3లక్షల -12 లక్షల యూనిట్ వరకు 60శాతం
- రూ. 12 లక్షలు ఆపై యూనిట్‌కు 60శాతం లేదా రూ. 5 లక్షల వరకు సబ్సిడీ
- ప్రింట్ తీసిన ఆన్‌లైన్ దరఖాస్తు
- రేషన్‌కార్డు/ఆహారభద్రత కార్డు
- ఆధార్‌కార్డు, ఈ ఆర్థిక సంవత్సరం జారీచేసిన ఆదాయ ధ్రువీకరణ
- కుల ధ్రువీకరణ
- ట్రాన్స్‌పోర్ట్ సెక్టార్ డ్రైవింగ్ సర్టిఫికెట్లు
SC Corporation loans in Telangana apply
For SC corporation loans in Telangana to apply visit official website : www.tsobmms.cgg.gov.in