Telangana Govt Jobs Notification 2022 for 80,039 Posts: K Chandrashekhar Rao announced that the State government will take up direct recruitment to fill up 80,039 posts immediately. The government has also decided to regularise services of 11,103 contract workers who are already working taking the total recruitment to 91,142 posts in various departments in Telangana. A notification will be issued shortly.
80,039 TS Govt Jobs Notification 2022
The Chief Minister stated that the upper age limit for direct recruitment would be relaxed by 10 years, to enable more unemployed to become eligible to compete in the proposed recruitment. Accordingly, except for uniformed services like police, the upper age limit for all other posts will be 44 years for OC, 49 years for SC, ST, BC, 54 years for Physically handicapped, and 47 years for ex-Servicemen.
Chandrashekhar Rao explained that since the State formation, the State government has notified 1,56,254 posts for recruitment, out of which 1,33,942 posts have been filled up. The remaining 22,312 posts are under the recruitment process. “Further, the Telangana government, as a policy, has decided that henceforth there will not be any more contractual appointments,” he declared amidst cheers from the legislators.
తెలంగాణలో నిరుద్యోగులకు భారీ బొనాంజ.. 80,039 ఉద్యోగాల భర్తీ షురూ
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ 2022 సమావేశాల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కీలక ప్రకటన చేశారు. ఊహించినట్లుగానే భారీగా కొలువుల భర్తీ ప్రకటనను స్వయంగా వెల్లడించారు.
మొత్తం 80,039 Telangana Govt Jobs Notification 2022 ఉద్యోగాలకు నేటి నుంచే భర్తీ ప్రక్రియ ప్రారంభం అని ప్రకటించారు. తమది ఎంప్లాయింట్‌మెంట్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని, హయ్యెస్ట్ పెయిడ్ ఎంప్లాయిస్ తెలంగాణలో ఉన్నారని ప్రకటించుకున్న తెలంగాణ సీఎం.. కేంద్రం వైఖరి వల్లే భర్తీ ప్రక్రియ ఆలస్యమైందని ఆరోపించారు.
‘‘తెలంగాణ ఏర్పాటు దేశ చరిత్రలో ప్రత్యేక ఘట్టం. నేనూ పోలీసు లాఠీ దెబ్బలు తిన్నా. అంతులేని వివక్ష, అన్యాయం ఎదుర్కొంది తెలంగాణ. వేరే పార్టీలకు రాజకీయాలంటే గేమ్.. టీఆర్‌ఎస్‌కు మాత్రం ఒక టాస్క్. ఈ రాష్ట్రం తెచ్చిన వాళ్లం మేం. మేం ఏం చేశామో ప్రజలకూ తెలుసు. పోరాటాలు చేశాం. జైలుకు వెళ్లాం. వ్యక్తిగత నిందలు ఎదుర్కొన్నా.
ఏకాగ్రత, లక్ష్యం దెబ్బతినకూడదనే ఉద్దేశంతో ఊరుకున్నాం. తెలంగాణ కోసం క్షోభ, బాధ అనుభవించాం. తెలంగాణ భాష అంటే ఒకప్పుడు హాస్యాస్పదంగా ఉండేది. ఒకప్పుడు జోకర్లకు ఉండే తెలంగాణ యాస.. ఇప్పుడు హీరోలకు వచ్చేసింది. అధికారికంగా పండుగలు జరుపుకుని.. సంస్కృతిని కాపాడుకున్నాం.
నీళ్లు, నిధులు, నియామకాలు.. ఉద్దేశంతో పోరాడాం. గోదావరి జలాలు సాధించుకున్నాం. తెలంగాణ కోసం విద్యార్థులు పోరాటాలు చేశారు. రెండు రోజులు ఆలస్యమైనా పని మంచిగా జరగాలనే కోణంలో పని చేసింది మా ప్రభుత్వం. ఇప్పటివరకు లక్షా 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. మరో లక్షా 56 వేల ఉద్యోగాలకు నోటిఫై చేశాం. రాష్ట్రపతి, ప్రధానులకు స్వయంగా నేనే చర్చించా.
దేశంలో ఎక్కడా లేని విధంగా.. శాశ్వతంగా 95 శాతం స్థానికులకే వచ్చేలా తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకుంది. ఇకపై అటెండర్ నుంచి ఆర్డీవో వరకు స్థానికులకే. టీచర్ల ప్రమోషన్లు పూర్తి చేయాలని ఆదేశాలిచ్చాం. 9, 10 షెడ్యూల్ పంచాయితీ ఇంకా తెగని కారణంగా.. మరికొన్ని పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు.
TS Govt Jobs District Wise List 2022
హైదారాబాద్- 5,268
నిజామాబాద్- 1,976
మేడ్చల్ మల్కజ్‌గిరి – 1,769
రంగారెడ్డి- 1,561
కరీంనగర్-1,465
నల్లగొండ-1,398
కామారెడ్డి- 1,340
ఖమ్మం- 1,340
భద్రాద్రి కొత్తగూడెం- 1,316
నాగర్ కర్నూలు-1,257
సంగారెడ్డి-1,243
మహబూబ్‌నగర్- 1,213
ఆదిలాబాద్-1,193
సిద్దిపేట- 1,178
మహబూబాబాద్: 1, 172
హన్మకొండ- 1,157
మెదక్- 1,149
జగిత్యాల- 1, 063
మంచిర్యాల-1, 025
యాదాద్రి-భువనగిరి- 1,010
జయశంకర్ భూపాలపల్లి- 918
నిర్మల్-876
వరంగల్-842
కొమురంభీం ఆసీఫాబాద్- 825
పెద్దపల్లి-800
జనగాం-760
నారాయణ్‌పేట- 741
వికారాబాద్-738
సూర్యాపేట-719
ములుగు- 696
జోగులాంబ గద్వాల-662
రాజన్న సిరిసిల్ల- 601
వనపర్తి-556
జోనల్ లెవల్‌లో 18, 866 పోస్టులు
మల్టీజోనల్‌లో 13, 170 ఉద్యోగాల ఖాళీ
ఇతర కేటగిరీ, వర్సిటీల్లో 8, 174 పోస్టులు
నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్ ప్రకటించడంతో పాటు మొత్తం ఖాళీలలో.. 11, 103 కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నట్లు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు సీఎం కేసీఆర్. అలాగే మిగిలిన వాటిల్లో 80, 039 పోస్టులకు ఇవాళ్టి(మార్చి 9, 2022) నుంచే నోటిఫికేషన్లు జారీ అవుతాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అంతేకాదు ఉద్యోగ గరిష్ట వయోపరిమితిని పదేళ్లకు పెంచుతున్నట్లు తెలిపారు.
Source: Sakshi